తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు ఈశ్వర్ ఠాకూర్
రిపోర్టర్: గోపి
స్థలం: ముంబై
ఎఫ్ఐఆర్, భాభిజీ ఘర్ పర్ హై వంటి ప్రముఖ ధారావాహికలలో నటించిన టెలివిజన్ నటుడు ఈశ్వర్ ఠాకూర్ తీవ్ర ఆరోగ్య సమస్యలతో తొమ్మిదోసారి ఆస్పత్రిలో చేరారు. మధుమేహం, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన రక్తపోటు పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు ఆయన సోదరి జయశ్రీ తెలిపారు. చికిత్స కోసం తమ ఇల్లు సైతం విక్రయించామని, ప్రస్తుతం కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ దాతల సహాయం కోరారు.