గంగానదిలో కొట్టుకుపోయిన 150 ఏళ్ల నాటి శివాలయం
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: మాల్దా
పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లా రతువా సమీపంలో 150 ఏళ్ల నాటి శివాలయం గంగానదిలో కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు ఫరక్కా బ్యారేజ్ నిండుకుండలా మారడంతో, నది ఉగ్రరూపం దాల్చి తీరప్రాంతాన్ని కోతకు గురిచేసింది.
తీరప్రాంతాన్ని కాపాడేందుకు గ్రామస్థులు ఇసుక సంచులతో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 12 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహానికి ఆలయం పూర్తిగా నదిలో కలిసిపోయింది. స్థానికులు ఈ ఘటనతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.