రాజీవ్ రహదారిపై ప్రమాదం: మంటల్లో దగ్ధమైన చేపల లారీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులో రాజీవ్ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న లారీ టైర్లు వేడెక్కి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైందని, లోపల ఉన్న ఇద్దరు వెంటనే కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానిక ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపుచేశారు. ఈ ఘటనతో రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు వెంటనే క్రమబద్ధీకరించారు.