టెస్టు క్రికెట్ ఆడాలనే తన కల బయటపెట్టిన రింకూ సింగ్
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
టెస్టు క్రికెట్‌లో భారత జస్ట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే తన ఆకాంక్షను టీమ్ఇండియా ఆటగాడు రింకూ సింగ్ వెల్లడించారు. తాను కేవలం ఒకే ఫార్మాట్ ఆటగాడిననే అభిప్రాయం తప్పు అని, దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నానని పేర్కొన్నారు. భారత్ తరఫున టెస్టులు ఆడాలన్నది తన కల అని స్పష్టం చేశారు. అలాగే 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడి టైటిల్ గెలవాలని ఆకాంక్షించారు.