ఇరాన్ యుద్ధంపై ప్రశ్నించిన జర్నలిస్టుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: నరేష్
స్థలం: Washington
అమెరికాలోని మార్-ఎ-లాగో రిసార్ట్ లో జరిగిన హలోవీన్ పార్టీ ఉద్రిక్తతకు దారితీసింది. ఇరాన్ తో యుద్ధంపై ప్రశ్నించిన న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతటి అసంబద్ధమైన ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ మూడు మధ్యంతర ఎన్నికల తర్వాత దాడుల ముప్పు ఉందన్న అంచనాల మధ్య ఈ వివాదం చోటుచేసుకుంది.