కీర్తి సురేష్ డోరతి చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: India

టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో అందాల తార కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా పీరియాడికల్ డ్రామా చిత్రం డోరతి. సనత్, రిషికాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. శిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.