రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: కిరణ్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడులో పదవ తరగతి బాలికపై జరిగిన దాడి ఘటనను సినిమాలకు ఆపాదించడం సరికాదని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, విషాదకర ఘటనలను వ్యక్తిగత కక్షలు, ప్రయోజనాల కోసం పావుగా వాడుకోవడం దారుణమని మండిపడ్డారు. బాధితులకు సానుభూతి తెలపాల్సిన సమయంలో అవకాశవాద రాజకీయాలు చేయడం తగదని, ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకోవాలని ఆయన తీవ్రస్థాయిలో హితవు పలికారు.