నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరుపై సీఎం చంద్రబాబు బహిరంగ విమర్శలు

రిపోర్టర్: నరేష్ స్థలం: పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరుపై సీఎం చంద్రబాబు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపాయి. నోడల్ ఆఫీసర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే పనితీరు కూడా సంతృప్తికరంగా లేదంటూ సీఎం చేసిన కామెంట్స్ కూటమిలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలతో అప్రమత్తమైన ఎమ్మెల్యే నాయకర్ అభివృద్ధి పనులను వేగవంతం చేసే పనిలో పడగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.