స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన శంఖారావం: దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీ సన్నద్ధమవుతోందని, ఇందులో భాగంగా ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పార్టీ అధిష్ఠానం అధికారికంగా వెల్లడించింది. మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, మండల పరిషత్, జిల్లా పరిషత్లతో పాటు పంచాయతీల్లో పోటీ చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలు తమ బయోడేటాతో కూడిన దరఖాస్తులను ప్రత్యేక పోర్టల్ ద్వారా సమర్పించాలని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.