భార్యను హత్య చేసిన భర్త, ప్రియురాలు అరెస్ట్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలోని ప్రహ్లాద్‌పూర్‌లో భార్య సబిల్లా ఖాతున్‌ను హత్య చేసిన కేసులో లాల్ బాబు, అతని ప్రియురాలు రుక్సార్ ఖాతున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వందలాది సీసీటీవీ కెమెరాలను పరిశీలించి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.