సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జీవో 118 ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ సమక్షంలోనే ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం, తోపులాట జరగడంతో సభలో గందరగోళం ఏర్పడింది.