ఇంజనీర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా పరిషత్‌లో ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్మరించుకున్నారు. సివిల్ ఇంజనీర్‌గా ఈ వేడుకల్లో పాల్గొనడం అదృష్టమన్నారు. నేటి ఇంజనీర్లు సీనియర్ల సలహాలతో తక్కువ ఖర్చుతో మెరుగైన నిర్మాణాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఇంజనీర్లను ఘనంగా సత్కరించి, ప్రతిభావంతులకు అవార్డులు అందజేశారు.