ఉద్యోగాలు ఆశచూపి విజయనగరంలో రూలక్షలు కాజేస్తున్న మోసగాళ్లు
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో ఉద్యోగాలు, ప్రైజ్‌మనీ, తక్కువ వడ్డీ రుణాలు ఆశచూపి సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు దోచేస్తున్నారు. అయ్యన్నపేట రైల్వేలో టీటీ ఉద్యోగం పేరుతో ఇద్దరు యువకుల నుంచి రూ.24.08 లక్షలు కాజేయగా, మరో ఘటనలో రూ.18 లక్షలు కోల్పోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో 55 మోసం కేసులు, 23 సైబర్ కేసులు నమోదయ్యాయని, ప్రజలు అత్యాశకు పోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.