మెగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: టీడీపీ
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న మెగా డీఎస్సీ ప్రక్రియపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలతో బురద జల్లుతున్నారని టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాజకీయ లబ్ధి కోసం అమాయకులైన నిరుద్యోగులను పావులుగా వాడుకుంటూ వ్యవస్థలపై నమ్మకం పోగొట్టేలా కుట్రలు పన్నుతున్నారని, సాక్షి మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్‌ను యువకుడు రామకృష్ణ బట్టబయలు చేశాడని నేతలు స్పష్టం చేశారు.