తుపాను ధాటికి గజగజ వణికిపోయిన విజయనగరం జిల్లా జనజీవనం

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయనగరం

తుపాను తీరం దాటే వేళ విజయనగరం జిల్లాలో ఈదురు గాలులు, ఎడతెరిపిలేని వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. వాగులు, గెడ్డలు పొంగిపొర్లగా, వందలాది విద్యుత్తు స్తంభాలు నేలకూలి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉద్యాన పంటలు నీట మునిగి కర్షకులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిందని, తాగునీరు, విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.