ఢిల్లీ హాఫ్ మరాథాన్ అంబాసిడర్‌గా షావునే మిల్లర్ యుబో
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
ప్రఖ్యాత వేదాంత ఢిల్లీ హాఫ్ మరాథాన్ 21వ ఎడిషన్‌కు రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన షావునే మిల్లర్ యుబో ఇంటర్నేషనల్ ఈవెంట్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. అక్టోబర్ 18న జరిగే ఈ పోటీలపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. క్రీడల ద్వారా ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో మరాథాన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రొకమ్ ఇంటర్నేషనల్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ సింగ్ ఆమె నియామకాన్ని వెల్లడించారు.