జన్నారంలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
శాంతిభద్రతలు, ప్రజారక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులను గుర్తుచేసుకుందామని మంచిర్యాల జిల్లా జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి జన్నారం మండల కేంద్రంలోని ధర్మారం చౌరస్తా నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు పోలీసులు, ప్రజాప్రతినిధులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేశ్ అధ్యక్షులు నందు నాయక్ పాల్గొన్నారు.