'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత': ఎస్పీ అద్నాన్ నయీం అస్మి

రిపోర్టర్: గోపి స్థలం: Andhra Pradesh

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి స్వయంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. బాధితుల సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన, చట్టపరంగా త్వరితగతిన న్యాయం చేకూర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని స్పష్టం చేశారు.