కావలి నియోజకవర్గంలో యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: నెల్లూరు
కావలి నియోజకవర్గంలో ప్రభుత్వ, పేదల భూములే లక్ష్యంగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అల్లూరు, దగదర్తి మండలాల్లోని పలు ప్రాంతాల్లో అధికార పార్టీ కార్యకర్తలు ముఠాలుగా ఏర్పడి రాత్రివేళల్లో గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఈ దందా నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గిరిజనులు, నిర్వాసితులకు కేటాయించిన భూములను ఆక్రమించి ఇష్టానుసారంగా తవ్వుతుండటంతో పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. అధికారుల ఉదాసీనత వల్లే అక్రమార్కులు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.