పొగాకు రైతులకు బ్యారన్కు యాభై వేల వడ్డీలేని రుణం
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించిందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అనుమతించిన పరిమాణానికి మించి పండించిన పొగాకును అపరాధ రుసుము లేకుండా కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించామన్నారు. మూలధన సహాయ పథకం కింద రాష్ట్రంలో నలభై నాలుగు వేల మంది రైతుల ఖాతాల్లో బ్యారన్కు యాభై వేల రూపాయల చొప్పున సుమారు రెండు వందల ఇరవై కోట్ల వడ్డీలేని రుణం జమ చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది.