గుంటూరు బాలిక కిడ్నాప్ కేసు: హరియాణాలో నిందితుడు జాన్ సైదా అరెస్టు

రిపోర్టర్: కృష్ణ స్థలం: గుంటూరు

గుంటూరులో సంచలనం సృష్టించిన బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడు షేక్ జాన్ సైదాను హరియాణాలోని కర్నాల్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ మిస్డ్ కాల్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, ఇది లవ్ జిహాద్ కాదని స్పష్టం చేశారు. నిందితుడి తల్లిదండ్రులను కూడా కేసులో చేర్చామని, బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించామని ఎస్పీ వెల్లడించారు.