రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ అడుగు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Lucknow
రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ వెల్లడించారు. పదవిలో ఉండగా ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోవడాన్ని గమనించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఉత్తరప్రదేశ్ తన ఖర్మభూమి అని, ఇక్కడి నుంచే రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తానని మంగళవారం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. గత నెలలో పదవికి రాజీనామా చేసిన ఆమె, ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది.