వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ సాధించగా బుమ్రాపై ఇంకా సందిగ్ధత

రిపోర్టర్: శివ స్థలం: India

అఫ్గనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ నిరూపించుకుని సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రానా, నితీశ్ కుమార్ రెడ్డిల ఫిట్‌నెస్‌పై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ముగ్గురి ఆటపై సెప్టెంబర్ 9న బీసీసీఐ తుది నిర్ణయం వెలువరించనుంది.