కరువు నివారణకు అఖిలపక్ష సలహాలు: రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ధ్యేయమని ఉత్తమ్ స్పష్టీకరణ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట ప్రాంతంలో ఎదురవుతున్న ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చే విలువైన సలహాలు, సూచనలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రైతుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.