సింగారంలో శివాలయ భూమి కబ్జాను వెంటనే అడ్డుకోవాలని గ్రామస్తుల డిమాండ్

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలం సింగారం గ్రామంలో దేవాదాయ శాఖ పరిధిలోని శివాలయ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా మహిళా సంఘ భవన నిర్మాణం జరుగుతోందని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, పవిత్రమైన దేవాలయ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.