దుర్గగుడి శరన్నవరాత్రి ఉత్సవాలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ సమీక్ష: ఏర్పాట్లపై కీలక ఆదేశాలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
విజయవాడ దుర్గగుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దేవాదాయ, పర్యాటక శాఖలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖుల కారణంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని సీఎం టెలికాన్ఫరెన్స్లో పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరవుతున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలని, స్వయం మహిళా సంఘాల ఉత్పత్తులకు సరస్ మేళా వేదిక కావాలని ఆయన సూచించారు.