ఏలూరు జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్ సొత్తు స్వాధీనం

రిపోర్టర్: మహేష్ స్థలం: ఏలూరు

ఏలూరు జిల్లా చోదిమెళ్లలో జరిగిన ఇంటి దొంగతనం కేసును ఏలూరు రూరల్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు మిత్తిరెడ్డి సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుండి పలు చోరీ కేసులకు సంబంధించిన బంగారం, వెండి వస్తువులు, టీవీలు, గ్యాస్ సిలిండర్లతో పాటు దొంగతనాలకు ఉపయోగించిన హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.