సాలూరు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి సర్కార్ పెద్దపీట: సంధ్య రాణి

రిపోర్టర్: రాజేష్ స్థలం: పార్వతీపురం మన్యం

సాలూరు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా సాగుతోందని పార్వతీపురం మన్యం ప్రాంతానికి చెందిన నేత సంధ్య రాణి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో పాచిపెంట మండలం గొట్టూరు నుంచి వేటగానివలస వరకు రూ.3.13 కోట్ల భారీ వ్యయంతో నూతన తారురోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఇరవై ఐదు ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు తెరదించి ఐదు పంచాయతీల ప్రజలకు ఎట్టకేలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందని ఆమె వెల్లడించారు.