గుండెపోటుతో కన్నుమూసిన సీపీఐ నాయకుడు ధనుంజయ మృతి

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం రూరల్ మండలం దారేడు గ్రామానికి చెందిన సీపీఐ నాయకుడు సొంటి ధనుంజయ గుండెపోటుతో మరణించారు. ఆయన భౌతికకాయంపై ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్, కార్యవర్గ సభ్యులు పుచ్చకాయల కమలాకర్ అరుణ పతాకం కప్పి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, సర్పంచ్ బత్తుల వెంకన్న పాల్గొని సంతాపం తెలిపారు.