కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఎకో సెన్సిటివ్ జోన్ 1 కిలోమీటర్ తగ్గింపు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని ఏకో సెన్సిటివ్ జోన్ ను ఒక కిలోమీటర్ కు తగ్గించాలని ఏప్రిల్ లోనే ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు జన్నారం ఎఫ్డిఓ రామ్మోహన్ రావు తెలిపారు. సంబంధిత మ్యాపును మీడియాకు ప్రదర్శించారు. ఇసుక సులభంగా లభిస్తుందని ఈ నిర్ణయం అటవీ అధికారుల పరిధిలో లేదని ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉందని స్పష్టం చేశారు.