అఖిల భారత కిసాన్ సభ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు

రిపోర్టర్: dumarla bhaskar senier journalist స్థలం: అచ్చంపేట

అఖిల భారత కిసాన్ సభ ముప్ పై ఆరో జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశ్యనాయక్ కోరారు. అచ్చంపేటలోని సిఐటియు కార్యాలయంలో మహాసభల కరపత్రాలను ఆయన విడుదల చేశారు. నవంబర్ పదిహేను నుంచి పద్దెనిమిది వరకు నల్లగొండలో ఈ మహాసభలు జరగనున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వస్తున్న సమస్యలపై ఈ వేదికపై సమగ్రంగా చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు.