రహదారి భద్రతను విస్మరిస్తే ముంచుకొచ్చే ముప్పు ముమ్మాటికీ నిజమే

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ సీఐ నందగిరి వెంకటేష్ గౌడ్ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతమైన అవగాహన కల్పించారు. వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ వాడాలని సూచించారు. అతివేగం, సెల్ఫోన్ వాడకం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ఎంతటి ప్రమాదకరమో వివరించారు. నిబంధనల పాటనే ప్రాణాలను కాపాడుతుందని పిలుపునిచ్చారు.