ఇండియా కూటమి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

రిపోర్టర్: కిరణ్ స్థలం: New Delhi

తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తేనీటి విందు సమావేశంలో పాల్గొన్నారు. ఈ కీలక సమావేశానికి ఇండియా కూటమి నేతలు, ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు, విద్యార్థి ప్రతినిధులు మరియు పౌర సమాజ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై పలు అంశాలపై చర్చించినట్లు ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.