షూటింగ్ లో గాయపడిన యువ నటుడు నార్నే నితిన్: కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

చిత్రీకరణ సమయంలో కుడి భుజానికి తీవ్ర గాయం కావడంతో యువ నటుడు నార్నే నితిన్ హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరినట్లు కిమ్స్ యాజమాన్యం వెల్లడించింది. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారని, కొన్ని రోజుల పాటు షూటింగ్ కు విరామం ఇవ్వనున్నారని వైద్య వర్గాలు స్పష్టం చేశాయి.