సైనికుడి కుటుంబ సమస్యపై రంగంలోకి ఆర్టీఐ పరిరక్షణ కమిటీ

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మంలో ఇంటి నంబర్ మార్పుపై సమస్య ఎదుర్కొంటున్న సైనికుని కుటుంబానికి ఆర్టీఐ పరిరక్షణ కమిటీ అండగా నిలిచింది. సైనికుడి విజ్ఞప్తిపై ఖమ్మం, వరంగల్, జనగాం జిల్లా అధ్యక్షులు శ్రీధర్ కాసోజు, కాట కుమారస్వామి, మహమ్మద్ జావిద్ స్పందించారు. ఇంటి నంబర్ మార్పుపై పాత రికార్డులను ఆర్టీఐ ద్వారా సేకరించి, అధికారులను సంప్రదించి బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని కమిటీ నాయకులు స్పష్టం చేశారు.