గ్రీన్‌లాండ్ భద్రతపై అమెరికాకు శాశ్వత నియంత్రణ కల్పిస్తూ చారిత్రక ఒప్పందం

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమెరికా

గ్రీన్‌లాండ్ పరిధిలోని భద్రతా వ్యవహారాలపై అమెరికాకు శాశ్వత నియంత్రణ కల్పిస్తూ డెన్మార్క్ మరియు గ్రీన్‌లాండ్ పాలకవర్గాలతో చారిత్రక ఒప్పందం కుదిరినట్లు యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో వ్యూహాత్మక ఆధిపత్యాన్ని సాధించడంలో భాగంగా అక్కడ భారీ అమెరికా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న సీఎన్‌ఎన్, ఎమ్ఎస్ నౌ, పొలిటికో వంటి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలపై వైట్‌హౌస్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.