10 రోజుల్లో సమగ్ర ప్రణాళికతో రావాలి: సీఎం చంద్రబాబు

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు లేదా ఇంటి పట్టాలు అందేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలకు సంబంధించి 10 రోజుల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రావాలని స్పష్టం చేశారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.