విద్యార్థులకు జోహో భారీ ఊరట: కేటలిస్ట్ ప్లాట్‌ఫారమ్ ఉచితంగా అందజేత
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
విద్యార్థులకు ఎలాంటి మౌలిక వసతుల ఖర్చులు లేకుండా తమ సొంత కేటలిస్ట్ సర్వర్‌లెస్ ప్లాట్‌ఫారమ్‌ను ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు వెల్లడించారు. సాఫ్ట్వేర్ అభివృద్ధికి అవసరమైన ఆధునిక క్లౌడ్ మౌలిక సదుపాయాలను విద్యార్థులు పూర్తిగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఐటీ రంగానికి చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం జోహో తీసుకున్న ఈ కీలక నిర్ణయం ద్వారా యువ డెవలపర్లు తమ ఆలోచనలను వేగంగా సరికొత్త ఉత్పత్తులుగా మార్చడానికి అద్భుతమైన అవకాశం లభిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.