మెదినీపూర్లో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహ భూమిపూజ కార్యక్రమం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కుకునూరుపల్లి
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మెదినీపూర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ శివారులో సామాజిక న్యాయానికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ బూర్గు మధుమోహన్ తెలిపారు. గ్రామస్థులు, ఎమ్మార్పీఎస్ మరియు అంబేద్కర్ సంఘం నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సమానత్వం, విద్య, ఆత్మగౌరవం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను భావితరాలకు చాటిచెప్పడమే ఈ విగ్రహ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని సర్పంచ్ స్పష్టం చేశారు.