మట్టి గణపతులనే పూజించాలి: విజయనగరం కలెక్టర్ పిలుపు

రిపోర్టర్: శివ స్థలం: విజయనగరం

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ వినాయక చవితి పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ప్రజలను కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వినియోగాన్ని నివారించి, పర్యావరణహితమైన మట్టి గణపతి ప్రతిమలను మాత్రమే పూజించాలని తెలిపారు. జలవనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని, నిమజ్జన సమయంలో పరిశుభ్రతకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.