స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా శ్రమ్ శక్తి భవన్లో శ్రమదానం

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

స్వచ్ఛతా హి సేవా ప్రచార ఉద్యమంలో భాగంగా శ్రమ్ శక్తి భవన్లో అధికారులు, సిబ్బందితో కలిసి ప్రత్యేక శ్రమదాన కార్యక్రమం నిర్వహించినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏక్ దిన్, ఏక్ గంటా, ఏక్ సాత్ నినాదంతో ఒక గంటపాటు పారిశుద్ధ్య పనుల్లో పాల్గొని సామాజిక బాధ్యతను చాటుకున్నామని పేర్కొంది. ఈ సామూహిక చర్య ద్వారా పరిశుద్ధమైన వాతావరణం పట్ల అవగాహన పెరిగిందని, ప్రజా భాగస్వామ్యం మరింత బలపడిందని స్పష్టం చేసింది.