కేంద్ర ప్రభుత్వంపై ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi

దేశంలో పెరుగుతున్న నిత్యావసర సరుకులు మరియు ఆహార ధాన్యాల ధరలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మధ్యతరగతి, పేద ప్రజల నడ్డి విరిసేలా ధరలు భగ్గుమంటున్నాయని, ప్రధాని మోదీ మాత్రం దీనిపై మౌనం వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసిద్ధ బాలీవుడ్ పాట క్యా హువా తేరా వాడాను ఉదాహరణగా చూపుతూ అచ్చే దిన్ ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.