మందడి సినిమా విజయంపై దర్శకుడు మతిమారన్ ప్రశంసలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: చెన్నై

మందడి సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా దర్శకుడు మతిమారన్ పుగళేంది నటీనటుల శ్రమను కొనియాడారు. ముఖ్యంగా ప్రమాదం జరిగి ముఖానికి ఇరవైకి పైగా కుట్లు పడినప్పటికీ, కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే షూటింగ్‌కు హాజరైన నటి మహిమా నంబియార్ అంకితభావాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే తమిళంలో తొలిసారిగా నటించిన సుహాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ మరియు సట్టా పులి పాత్రకు లభిస్తున్న స్పందనపై దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు.