హార్ముజ్ జలసంధి భద్రతపై ఇరాన్ సంచలన హెచ్చరిక
రిపోర్టర్: రమేష్
స్థలం: World
హార్ముజ్ జలసంధిలో ఒమన్‌తో కుదిరిన కొత్త ఒప్పందం ఆ ప్రాంతంలో భద్రతకు పూర్తి గ్యారంటీ ఇవ్వలేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందం కేవలం రెండు దేశాల ద్వైపాక్షిక విషయమని విదేశాంగ శాఖ తెలిపింది. జూన్ 18 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టిస్తోందని, దౌత్య మార్గాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని తీవ్రస్థాయిలో మండిపడింది.