కూటమిలో కొలిక్ కి వచ్చిన జడ్పీ ఛైర్మన్ పదవుల పంపకాల కసరత్తు
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల సర్దుబాటుపై తెదేపా, జనసేన, భాజపా మధ్య చర్చలు దాదాపు కొలిక్ కి వచ్చాయని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం ఇరవై ఎనిమిది జడ్పీలలో జనసేనకు ఐదు ఛైర్మన్ పదవులు, ఒక వైస్ ఛైర్మన్ పోస్టు, భాజపాకు ఒక ఛైర్మన్ స్థానం కేటాయించేలా అవగాహన కుదిరిందని సమాచారం అందుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వర్గాలు స్పష్టం చేశాయి.