రామజన్మభూమి ట్రస్ట్ విరాళాల వివాదం: పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల నిర్వహణలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలైనట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు వెల్లడించడంతో ప్రధానన్యాయమూర్తి సూర్యకాంత్ ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. విరాళాల లెక్కింపు సమయంలో దొంగతనాలు జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ట్రస్ట్ నిధుల దుర్వినియోగంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ పలువురు పిటిషన్లు వేశారు.