క్రాప్ హాలిడే ప్రచారంపై స్పష్టతనిచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రతిపక్షాల తప్పుడు మాటలను రైతులు నమ్మవద్దని ఆయన హితవు పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉన్న దృష్ట్యా, అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆరుతడి పంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నదని, రాయితీపై ప్రత్యామ్నాయ విత్తనాలు అందిస్తున్నామని ఆయన వివరించారు.