అంబర్‌పేట ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రిపోర్టర్: కృష్ణ స్థలం: Amberpet, Hyderabad

సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అంబర్‌పేట పటేల్ నగర్ ప్రభుత్వ సీపీఎల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అందుతున్న బోధన, మౌలిక వసతులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే పాఠశాలలోని మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, ఇతర సదుపాయాల గురించి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో ఆయన చర్చించారు.