పింఛన్ల దరఖాస్తుల వెనుక రాజకీయ ఉద్దేశాలు: గీతారవి

రిపోర్టర్: Dinesh panda స్థలం: పలాస

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో పింఛన్ల దరఖాస్తు ప్రక్రియపై 10వ వార్డు మాజీ కౌన్సిలర్ సర్వాన గీతారవి స్పందించారు. ఎన్నికల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రక్రియను తెరపైకి తెచ్చిందని, దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆమె తీవ్రంగా విమర్శించారు.

ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతర ప్రక్రియగా సాగాలని ఆమె డిమాండ్ చేశారు. ఏదేమైనా, అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.