పోలవరం ఎత్తు తగ్గింపుపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి నిమ్మల ధ్వజం

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై మాజీ సీఎం జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతిలో మండిపడ్డారు. వైకాపా హయాంలోనే ప్రాజెక్టును రెండు దశలుగా మార్చి +41.15 మీటర్ల ఎత్తుకు నిధులు ఇవ్వాలని కోరింది జగనేనని ఆయన స్పష్టం చేశారు.